- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొందరు నన్ను టార్గెట్ చేసి వీడియోలు సృష్టిస్తున్నారు.. నాకు నచ్చినట్టు ఉంటే మీకేం నొప్పి అనసూయ పోస్ట్
అనసూయ (Anasuya)జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించింది.

దిశ, సినిమా: అనసూయ (Anasuya)జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించింది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఒక్కసారిగా అనసూయ రేంజ్ మారిపోయింది. ఇక బుల్లితెరకు దూరం అయిన అనసూయ వరుస చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, అనసూయ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ కీలక నోట్ విడుదల చేసింది. తనపై కొందరు తప్పుడు వీడియోలను సృష్టించి నెట్టింట వైరల్ చేస్తున్నారని అలా చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. ‘‘నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా గడిపినా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా ఛానెల్‌లు నన్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని మరీ వీడియోలు సృష్టిస్తున్నారు. వారు ఎవరో నాకు తెలియదు.. నేను వాళ్లకు తెలియదు.. అయినప్పటికీ వారు నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు.
అవును నేను ఓ స్త్రీని, భార్యను తల్లిని. అయినా నాకు నచ్చిన దుస్తులు ధరిస్తున్నాను. తల్లి అయితే గ్లామరస్‌గా ఉండకూడదని లేదు కదా. నా కుటుంబం, నా భర్త, పిల్లలు నాకు సపోర్ట్‌గా ఉంటారు. కొందరు దాన్ని సహించలేకపోతున్నారు. నా పిల్లలు నమ్మకంగా, దయగా, గౌరవంగా ఉంటారు. పట్టుదలగా ఉండడం అంటే అగౌరవంగా ఉండడం కాదు. నాకు నచ్చిన విధంగా దుస్తులు ధరించడం నా విలువలను కోల్పోవడం కాదు. నన్ను అనుసరించమని నేను ఎవరినీ అడగడం లేదు.
మీరు మీకు నచ్చినట్లు జీవించాలని ఎలా కోరుకుంటున్నారో నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి భంగం కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదు. మీ ప్రవర్తన బట్టి నేను మిమ్మల్ని అంచనా వేయను. మీరు కూడా ఇతరుల జీవనశైలి విషయంలో అదే మర్యాదను అందిస్తారని నేను ఆశిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ఇతరుల పట్ల గౌరవాన్ని కొనసాగిస్తూనే, గర్వంగా, ప్రేమగా క్షమాపణ లేకుండా ఉంటాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అనసూయకు సపోర్ట్‌గా నిలుస్తు్న్నారు.






