‘ఓజీ’ మూవీలో అన్ని అలాంటి సీన్స్ ఉన్నాయి.. ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం: ప్రియాంక మోహన్

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’.

‘ఓజీ’ మూవీలో అన్ని అలాంటి సీన్స్ ఉన్నాయి.. ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం: ప్రియాంక మోహన్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) విలన్ పాత్రలో కనిపించనుండగా.. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడతారు. ఆయన ఒక రోజు ముందుగానే ఆ సన్నివేశానికి సిద్ధమై, దర్శకుడు, నటులను కలిసి, దానిని మరింత మెరుగుపరిచేందుకు చర్చిస్తారు. పలు సన్నివేశాలను మరింత అందంగా తీర్చిదిద్దారు. నేను 'సువ్వి సువ్వి' పాటలో మాత్రమే ఉన్నాను. సినిమాలో నాకు వేరే పాటలు లేవు. ఎందుకంటే ‘ఓజీ’ మొత్తం యాక్షన్ సీన్స్‌తో నిండి ఉంది. నేను ఈ సినిమా చూడలేదు. నాకు మొదటి రోజే పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో చూడటం ఇష్టం. ఎవరో అన్నారు, సంధ్యా థియేటర్‌లో బాగుంటుందని వీలైతే ఈ స్క్రీన్‌లో మూవీ చూడాలని అనుకుంటున్నాను.

అలాగే నాకు ఇమ్రాన్ హష్మీ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. ఆ సర్ప్రైజ్ సెప్టెంబర్ 25న థియేటర్లలో చూడండి. చివరగా నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.. గత కొద్ది కాలంగా కొందరు డబ్బులిచ్చి మరీ నాపై ట్రోల్స్ చేపిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. నన్ను ఇష్టపడని లేదా నన్ను ద్వేషించే వాళ్ళు కొందరు నా గురించి నెగిటివ్ మీమ్స్ పోస్ట్ చేయడానికి వారికి డబ్బు చెల్లిస్తున్నారు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు కానీ అవన్నీ పట్టించుకోదలుచుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story