- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ ఫుల్ లుక్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్.. ఒక్క పోస్ట్‌తో సినిమాపై భారీ హైప్
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

దిశ, సినిమా: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni)హీరోగా అరంగేట్రం చేయనున్న విషయం ఇప్పటికే అధికారికంగా వెల్లడై మంచి బజ్ క్రియేట్ చేసింది. స్టార్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు ఫ్రెష్ లుక్‌తో ఇండస్ట్రీలోకి వస్తుండటంతో జయకృష్ణపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. జయకృష్ణ డెబ్యూ మూవీకి ‘RX100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని(Rasha Tadani) హీరోయిన్‌గా నటిస్తుండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అశ్వనీదత్ సమర్పణలో కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, విడుదల చేసిన ఒక్క టైటిల్ పోస్టర్‌తోనే మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నారు.
ఈ నేపథ్యంలో, తాజాగా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ చేతుల మీదుగా లాంచ్ చేయించడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది. మహేష్ బాబు స్వయంగా జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్‌లో జయకృష్ణ బైక్‌పై దూసుకెళ్తూ, సైడ్‌కు వంగి శత్రువులకు గన్ గురిపెట్టి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు. బైక్ కింద మట్టి ఎగిరిపడుతున్న విజువల్స్‌తో పోస్టర్ మొత్తం ఇంటెన్సిటీతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, నెటిజన్లు “మాస్ ఎంట్రీ”, “పవర్‌ఫుల్ డెబ్యూ” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Read More..






