నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai)బాక్సాఫీసు వద్ద సంచనాలు సృష్టిస్తోంది.

నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai)బాక్సాఫీసు వద్ద సంచనాలు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు రాబడుతూ సినీ సెలబ్రిటీల ప్రశంసలు పొందుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. దీంతో సినీ ప్రియులంతా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈక్రమంలో.. తాజాగా, ‘మిరాయ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

కేవలం నెలరోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. ఈ చిత్రం హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 10 నుంచి తెలుగు, తమిళ, మలయాళ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ‘‘తొమ్మిది గ్రంథాలు. అనంతమైన శక్తి. బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఒక సూపర్ యోధుడు. భారతదేశం సొంత సూపర్ హీరో మిరాయ్, అక్టోబర్ 10 నుండి మీ ఇంటి రాబోతున్నారు’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)కాంబోలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలో కనిపించి నటనతో మెప్పించారు.

Next Story