‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్.. డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) రెండేళ్ల గ్యాప్ తర్వాత మల్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్.. డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) రెండేళ్ల గ్యాప్ తర్వాత మల్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ (Ananganaga Oka Raju)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మారి (maari) దర్శకత్వంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ‘అనగనగా ఒక రాజు’ ప్రాజెక్ట్‌పై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈక్రమంలోనే.. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే ఇందులోంచి ఫస్ట్ సింగిల్ ‘బల్మా’ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అత్యధిక వ్యూస్ రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా, చిత్రబృందం మరో పాట రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘అనగనగా ఒక రాజు’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రాజు గారి పెళ్లి రో’ అని సాగే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఫుల్ సాంగ్ మాత్రం డిసెంబర్ 26న రిలీజ్ చేస్తామని అందుకు అందరూ ఈ వెడ్డింగ్ పాటకు డ్యాన్స్ చేసేందుకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి మాస్ స్టెప్ వేస్తున్న పోస్టర్‌తో అంచనాలను పెంచేశారు.

link

Next Story