- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెకండ్ రౌండ్ ప్రారంభమైంది.. హిట్ మూవీ సీక్వెల్ ప్రకటిస్తూ ఐశ్వర్య పోస్ట్
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), విష్ణు విశాల్(Vishnu Vishal) కాంబినేషన్‌లో వచ్చిన ‘గట్ట కుస్తీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), విష్ణు విశాల్(Vishnu Vishal) కాంబినేషన్‌లో వచ్చిన ‘గట్ట కుస్తీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో వచ్చి ప్రేక్షకులను అలరించింది. చెల్ల అయ్యవుchella ayyav) దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మించారు. 2022లో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. తాజాగా, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఈ చిత్రానికి చెల్ల అయ్యవ్ దర్శకత్వం వహిస్తుండగా.. వెల్స్ ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇందులో ‘గట్ట కుస్తీ’ లో నటించిన వారంతా మరోసారి అలరించబోతున్నారు. ఇక ‘గట్ట కుస్తీ’లో పెళ్లి తర్వాత భార్య తన మామను కొట్టిందని హీరోయిన్‌ను తన పుట్టింటికి పంపుతాడు. ఒక అమ్మాయి అలా కొట్టడం తప్పు అని అబ్బాయిలు అన్నింటిలో గొప్ప అనే అభిప్రాయంలో హీరో ఉంటాడు. తర్వాత హీరోయిన్ కుస్తీ పోటిల్లో పాల్గొంటుంది. విడాకుల నోటీసు కూడా పంపుతారు. ఆ తర్వాత తన భార్య కోసం కుస్తీ పోటీల్లో పాల్గొని విన్నర్‌గా సంచలనం సృష్టించి భార్యతో కలిసిపోతాడు. అయితే ఈ సీక్వెల్‌లో వారికి ఓ బిడ్డ పుడితే వారి జీవితం ఎలా ఉండబోతుందో చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.






