పవన్ కల్యాణ్ ‘OG’ విడుదల తేదీ ఖరారు.. మరో ఇండస్ట్రీ హిట్టు పక్కానా?

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ ‘OG’ విడుదల తేదీ ఖరారు.. మరో ఇండస్ట్రీ హిట్టు పక్కానా?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓజీ(OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో తమిళ నటి ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండంతో ఫ్యాన్స్‌లోనూ ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సాహోతో బాలీవుడ్‌ను షేక్ చేసిన సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ అభిమానుల్లో రెట్టింపు అంచనాలు పెంచాయి.

ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైందంటూ సోషల్ మీడియాలో పోస్టర్స్‌ ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పుట్టినరోజున(సెప్టెంబర్ 27) ఈ చిత్రం విడుదల కాబోతోదంటూ వార్తలు విస్తృతమయ్యాయి. గతంలో ఇదే తేదీన త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో మరో ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలతో ట్విట్టర్‌(ఎక్స్)ను షేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Next Story