లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నేచురల్ బ్యూటీ కన్ఫర్మ్.. లక్కీ చాన్స్ కొట్టేసిందిగా!

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. జీవిత కథల్ని సినిమాలుగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటుగా.. లాభాలు పొందుతున్నారు.

లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నేచురల్ బ్యూటీ కన్ఫర్మ్.. లక్కీ చాన్స్ కొట్టేసిందిగా!
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. జీవిత కథల్ని సినిమాలుగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటుగా.. లాభాలు పొందుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులంతా బయోపిక్స్ చేసే పనిలో బిజీ అయిపోయారు. త్వరలో ప్రధాన మంత్రి మోడీ బయోపిక్ భారీ స్థాయిలో రాబోతుంది. మోడీ పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. మరోవైపు మోస్ట్రో ఇళయరాజా బయోపిక్‌ కూడా రాబోతుంది. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో మరొక బయోపిక్ రాబోతున్నట్లు సమాచారం.

ఎన్నో మధురమైన పాటలకు సంగీతం అందించడంతో పాటు తన మధురమైన గాత్రంతో అద్భుతమైన పాటలు పాడిన లెజెండరీ సింగర్, నటిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి(M.S. Subbulakshmi) జీవిత కథ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారం పొందిన మొట్టమొదటి కళాకారిణి అయిన ఎం.ఎస్ సుబ్బులక్ష్మి జీవితంలో జరిగిన విషయాలను ప్రేక్షకులకు చూపించబోతున్నారట. ఆమె జీవితాన్ని వెండితెరపై చూపించే ప్లాన్‌లో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అల్లు అరవింద్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ తెరకెక్కించనున్నట్లు టాక్. జెర్సీ, కింగ్‌డమ్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri)డైరెక్షన్‌లో రాబోతుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ కూడా చేశారట.

అయితే ఎం.ఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi)ని తీసుకోవాలని మేకర్స్ ఆమెను సంప్రదించారట. లుక్ టెస్ట్‌కు సంబంధించిన డిస్కషన్ నడుస్తుండగా.. మొత్తానికి ఆమెని ఫైనల్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు.. అమ్మడు లక్కీ ఛాన్స్ కొట్టేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘అమరన్’లో సాయి పల్లవి నటనపై ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ బయోపిక్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Next Story