మెగాస్టార్ చేతుల మీదుగా ప్రారంభమైన ‘స్పిరిట్’ సినిమా.. ఫుల్ ఖుషీలో ప్రభాస్ అభిమానులు

by Mallepaka Hamsa |

ప్రభాస్(Prabhas) అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ (Spirit)రెగ్యులర్ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది.

మెగాస్టార్ చేతుల మీదుగా ప్రారంభమైన ‘స్పిరిట్’ సినిమా.. ఫుల్ ఖుషీలో ప్రభాస్ అభిమానులు
X

దిశ, సినిమా: ప్రభాస్(Prabhas) అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ (Spirit)రెగ్యులర్ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. నేడు ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)స్పెషల్ గెస్ట్‌గా వచ్చి క్లాప్ కొట్టడంతో వేడుక ప్రత్యేక అకర్షణగా మారింది. ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా, త్రిప్తి డిమ్రితో పాటు నిర్మాతలు భూషన్ కుమార్, శివ చననా, వంగా ప్రణయ్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ పేర్లను మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషనల్‌గా రాబోతున్న ఈ సినిమాను వంగా పిక్చర్స్, టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో డార్లింగ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంటెన్స్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్స్‌లోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

link

Next Story