- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న డైరెక్టర్.. అసలేం జరిగిందంటే?
సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యే ముందు దర్శక నిర్మాతలు ఏదైన గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

దిశ, సినిమా: సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యే ముందు దర్శక నిర్మాతలు ఏదైన గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే మరికొందరు తమకు విజయాన్ని అందించిన దేవుడి దగ్గరకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. గతంలో టాలీవుడ్ దర్శకులు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, వెంకీ అట్లూరి సినిమా రిలీజ్ అయ్యాక తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇటీవల ‘మిరాయ్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)తిరుమలకు వెళ్లారు. గురువారం తిరుమలు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
అంతేకాకుండా శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. గుండుతో కనిపిస్తున్న ఆయనను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. గుండుతో కనిపించడానికి చాలామంది ఇష్టపడరు అలాంటిది కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. ‘మిరాయ్’ దర్శకుడితో పాటు హీరో తేజ సజ్జా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన వీరిద్దరు ప్రేక్షకులకు ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. తేజ సజ్జా(Teja Sajja,), కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన ‘మిరాయ్’ బాక్సాఫీసు వద్ద పలు సంచలన రికార్డులు సృష్టించింది. ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. భారీ కలెక్షన్లు రాబట్టింది.






