'బ్రహ్మాస్త్ర' OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

by Disha Web Desk 6 |
బ్రహ్మాస్త్ర OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ నటించిన పాన్‌ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'. ఈ చిత్రంలో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ కీలకపాత్రలు పోషించారు. తెలుగులో 'బ్రహ్మాస్త్రం'గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు పార్ట్ 2, 3 ఉంటాయని డైరెక్టర్ అయాన్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఇదంతా పక్కన పెడితే.. సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. నవంబర్ 4 నుంచి అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి : రాత్రి అయితే ఆ హీరో విశ్వరూపం.. భరించలేని లవర్, ఫ్రెండ్స్ ఏం చేశారంటే..?

Next Story