'హరి హర వీరమల్లు' నుంచి బిగ్ అప్‌డేట్

by Disha Web |
హరి హర వీరమల్లు నుంచి బిగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా : పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ట్విట్టర్ వేదికగా విషయాన్ని తెలిపిన మూవీ యూనిట్.. 'చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన సినిమా తీయడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. ఖచ్చితమైన వివరాలతో కూడిన పరిశోధన, వందలాది మంది తారాగణం, సిబ్బంది అపారమైన కృషి దీనికి అవసరం అవుతుంది.

అక్టోబర్ చివరి వారం నుంచి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్‌తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రపంచంలోని ప్రేక్షకులంతా సెలబ్రేట్‌ చేసుకునే మైలురాయి అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్ధతు నిరంతరం మాకు అందిస్తారని కోరుకుంటున్నాం' అనే సందేశాన్ని అభిమానులతో పంచుకుంది.
Next Story

Most Viewed