- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > సల్మాన్‌ను చంపేందుకు ప్లాన్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్స్.. భద్రత పెంచిన పోలీసులు
సల్మాన్‌ను చంపేందుకు ప్లాన్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్స్.. భద్రత పెంచిన పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ చాలా సార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ చాలా సార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరోసారి ముంబై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈమెయిల్ ద్వారా ఆయనకు హెచ్చరికలు పంపింది. దీంతో సల్మాన్ సిబ్బంది వెంటనే పోలీసులను సంప్రదించారు.
వారి ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్ మీద బాంద్రా పోలీసులు ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అంతేకాదు సల్మాన్ ఇంటి చుట్టూ వై ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నాడు.
Next Story






