- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ బర్త్ డే స్పెషల్.. ‘ఓ సుకుమారి’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల.. హిట్ ఖాయం అంటున్న నెటిజన్లు
టాలీవుడ్‌లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh).

దిశ, సినిమా: టాలీవుడ్‌లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). గత ఏడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ విజయంతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో తిరువీర్(Thiruveer)కు జోడీగా నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ‘మసూద’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న తిరువీర్‌తో కలిసి ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సుకుమారి’(OhSukumari). ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. భరత్ దర్శన్ ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండటం మరో విశేషం.
ఝాన్సీ, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్, మురళీధర్ లాంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందించగా, షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మూవీపై క్యూరియాసిటీని పెంచేలా మేకర్స్ వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. నేడు ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ‘ధామిని’ అనే పాత్రలో కనిపించనుండగా, మెరూన్, నెవీ బ్లూ కలర్ లంగా ఓణీలో పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంది. పోస్టర్‌లో ఐశ్వర్య పరుగెత్తుతూ ఉండగా, ఆమె చుట్టూ కోళ్లు ఎగురుతుండటం, వెనక ఊరి జనాలు ఆమెను వెంబడిస్తున్న కనిపించడం ఆసక్తిని రేపుతున్నాయి.
ఈ విజువల్స్ చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమకథగా ‘ఓ సుకుమారి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఐశ్వర్య ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో సంప్రదాయ లుక్‌లో భాగ్యగా కనిపించి ఐశ్వర్య ఎంతోమంది మనసులు గెలుచుకుంది. అలా ధామిని పాత్ర కూడా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.






