- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి.. భయాందోళనకు గురి చేస్తున్న ‘కిష్కింధపురి’ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ఇటీవల ‘భైరవం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ఇటీవల ‘భైరవం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీ అయిపోయాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘కిష్కింధ పురి’ (Kishkindha Puri)ఒకటి. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి(Kaushik Pegallapati) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘కిష్కింధపురి’ టీజర్ విడుదల చేసి ప్రేక్షకులను భయపెట్టారు. '‘నమస్కారం... ఈ రోజు శుక్రవారం. 9 - 8 -1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయ్. పునః ప్రసారాలు నేటితో మొదలవుతాయి’’ అని ఓ భయంకరమైన వాయిస్ వినిపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. ఓ పాత భవనం, వింటేజ్ లుక్, గ్రామంలో భయానక పరిస్థితులు, మనిషి సజీవ దహనం, బస్సు కాలిపోవడం అన్నింటిని మిస్టీరియస్‌గా చూపించి హైప్ పెంచారు. ఇక ఈ టీజర్‌ను విడుదల చేస్తూ.. ‘‘సువర్ణమాయ రేడియో స్టేషన్.. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే ఓ కన్ను లోపలి భాగాన్ని చూపించగా.. అనుపమ, సాయి శ్రీనివాస్ రేడియోలు పట్టుకుని ఆందోళన చెందుతూ ఎడ మొహం, పెడ మొహంలా నిల్చున్నారు.






