- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా బొ***లో ప్రపంచం చల్ తీ.. ‘భోగి’ నుంచి డింపుల్ హయాతీ మాస్ లుక్ విడుదల చేసి షాకిచ్చిన దర్శకుడు
దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన బోల్డ్ క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. “నా బొ***లో ప్రపంచం.. చల్ తీ! మందారం ఈడ….”* అంటూ చాలా రా అండ్ రస్టిక్ స్టైల్‌లో ఈ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, మరో కీలక పాత్రలో మాస్ బ్యూటీ డింపుల్ హయాతీ కనిపించబోతోంది. తాజాగా డింపుల్ హయాతీకి సంబంధించిన ‘ఫస్ట్ లుక్’ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో డింపుల్ ‘మందారం’ అనే ఊర మాస్ పాత్రలో కనిపిస్తోందని సంపత్ నంది సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఆమె లుక్‌ను పరిచయం చేస్తూ దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన బోల్డ్ క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. “నా బొ***లో ప్రపంచం.. చల్ తీ! మందారం ఈడ….”* అంటూ చాలా రా అండ్ రస్టిక్ స్టైల్‌లో ఈ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. మందారం ప్రపంచం కోరుకునే అందమని, కానీ ఎప్పటికీ ఎవరూ అర్థం చేసుకోలేని ఒక ఆత్మ అని ఆ పాత్రలోని లోతును వివరించారు. విడుదలైన పోస్టర్‌లో డింపుల్ హయాతీ ఎరుపు రంగు చీర కట్టుకుని, నుదుటన పెద్ద బొట్టు, తలలో పూలు, చేతిలో విసనకర్ర పట్టుకుని పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తోంది.
ఆమె చూపుల్లోని గాంభీర్యం, ఆహార్యం సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాలో డింపుల్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. ఓ పవర్ ఫుల్ పాత్రతో ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించనుందట. అయితే ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఒక క్లాస్ లుక్‌లో కనిపించగా, డింపుల్ లుక్ దానికి పూర్తి భిన్నంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది చూసిన వారంతా అస్సలు ఊహించలేదని.. ఆ పాత్ర అయినా అమ్మడుకి హిట్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాగా.. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘ధమాకా’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. శర్వానంద్ సరికొత్త మేకోవర్, సంపత్ నంది మార్క్ టేకింగ్, ఇద్దరు హీరోయిన్ల విభిన్న పాత్రలు ‘భోగి’ సినిమా రేంజ్‌ను పెంచనున్నాయని తెలుస్తోంది.






