Bhola Shankar :మెగా ఫెస్టివల్ వచ్చేస్తుంది ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

by Disha Web Desk 6 |
Bhola Shankar :మెగా ఫెస్టివల్ వచ్చేస్తుంది ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేశ్ కాంబినేషనల్‌లో వస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్ చిరు చెల్లి గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇటీవల భోళాశంకర్ పాటల సందడి సమయం వచ్చేసిందంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించి గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సాంగ్ ప్రోమో జూన్ రెండున రిలీజ్ కానున్నట్లు.. ఇక ఫుల్ లిరికల్ సాంగ్ జూన్4న విడుదల చేయబోతున్నట్లు ఓ పోస్టర్‌ను వదిలారు. అంతేకాకుండా మెగా ఫెస్టివల్ వచ్చేస్తుందంటూ చిత్ర యూనిట్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందిస్తుండడంతో ఈసారి భోళా శంకర్ సాంగ్స్ మరో రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ 11న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.


Next Story

Most Viewed