ఆ నటుడు కింద నలిగి పోవాల్సి వచ్చింది.. నా వల్ల కాదన్నా వినలేదంటూ నటి బోల్డ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-12 02:48:38  IST  )

గత కొద్ది రోజుల నుంచి సినిమాల్లో బూతు కంటెంట్ మరీ ఎక్కువైపోతుంది. హీరో,హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉండటం వల్ల ఫ్యామిలీ చిత్రాలు తగ్గిపోయాయి.

ఆ నటుడు కింద నలిగి పోవాల్సి వచ్చింది.. నా వల్ల కాదన్నా వినలేదంటూ నటి బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినిమాల్లో బూతు కంటెంట్ మరీ ఎక్కువైపోతుంది. హీరో,హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉండటం వల్ల ఫ్యామిలీ చిత్రాలు తగ్గిపోయాయి. అలాగే చాలామంది కుటుంబంతో కలిసి చూసేందుకు ఇబ్బంది పడుతున్నారు. అలాగే అలాంటి సీన్స్ చేయడానికి మాకూడా ఇబ్బందిగానే ఉందంటూ ఓ నటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మరెవరో కాదు మంగళవారం(mangalavaram), తండేల్(Thandel) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య పిళ్లై(Divya Pillai). ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్‌లో నటించి ప్రశంసలు, విమర్శలు పొందింది. తాజాగా, ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య తన తొలి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘‘నేను ‘కళాపురుష్’ అనే మలయాళం సినిమాలో టొవినో థామస్‌తో ఇంటిమేట్ సీన్‌లో నటించా. దర్శకుడు ఈ సీన్ గురించి వివరించిప్పుడు ఒప్పుకోలేదు. చుట్టూ జనం ఉండగా.. కెమెరాలలో రికార్డ్ అవుతుండగా నా వల్ల కాదని చెప్పేశాను. కోపం, బాధ ఇలా ఏ ఎమోషన్ అయినా చేస్తాను కానీ ఇంటిమేట్ సీన్స్‌లో చేయడం నా వల్ల కాదని చెప్పాను. అయినా వినలేదు.. డైరెక్టర్ చెప్పింది చేయాలని అన్నారు. కానీ ఆ తర్వాత నేను కూడా ఆలోచించా.. ఇలాంటి సీన్స్‌లో చేస్తే ప్రజలు నా గురించి, నా వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారో అనుకున్నా. కానీ టొవినో థామస్ కోసం షూటింగ్ పూర్తి చేశా.

80 కేజీల బరువు ఉన్న నటుడు నాపై పడుకుని ఉన్నప్పుడు కెమెరా పొజిషన్‌కు తగినట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. కెమెరా ఉన్నంతసేపు అతడి కింద నలిగిపోవాల్సిందే. ఆ సమయంలో ముద్దును కూడా ఎంజాయ్ చేయలేం. లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో నటించేటప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా ఆ ఫీలింగ్ ఫేస్‌లో చూపించకూడదు. సహ నటుడు ఏం చేసినా కట్ చెప్పే వరకు భరిస్తూ ఉండాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Next Story