- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంఘటన నన్ను కదిలించింది.. కన్నీరు పెట్టిస్తున్న రాఘవ లారెన్స్ ట్వీట్.. అసలేం జరిగిందంటే?
కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) ఓ వైపు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) ఓ వైపు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే ఎక్కడా ఎవరు ఇబ్బందులో ఉన్నా వెంటనే స్పందించి తనవంతు సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ ప్రశంసలు పొందుతున్నాడు. అంతేకాకుండా ఓ ఫౌండేషన్ కూడా స్థాపించి ఎంతోమందికి సాయం అందిస్తున్నాడు. సినిమాల్లో పని చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు సాయం కోరినా లారెన్స్ ఆదుకుంటున్నాడు. తాజాగా, రాఘవ లారెన్స్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఓ తండ్రి తన కూతురు చదువు కోసం తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టడం తనను ఎమోషనల్ అయ్యేలా చేసిందని చెప్పాడు.
‘‘అందరికీ హాయ్! తన కూతురి చదువు కోసం తన దివంగత భార్య తాలిని తాకట్టు పెట్టిన తండ్రి గురించిన కథను నేను చూశాను. ఇది నన్నుకదిలించింది. ఎందుకంటే నా స్వంత కుటుంబం ఒకప్పుడు ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొంది. నేను తాలిని తిరిగి అతనికి ఇవ్వగలిగాను. అది కేవలం బంగారం కాదు, అతని ప్రియమైన భార్య విలువైన జ్ఞాపకం. ఈ రోజు నా హృదయం నిజంగా నిండిపోయింది’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






