- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అనుభవం జీవితాంతం గుర్తిండిపోతుంది.. నిహారిక ఎమోషనల్ కామెంట్స్
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)నిర్మాతగా సత్తా చాటుతోంది.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)నిర్మాతగా సత్తా చాటుతోంది. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, నటిగా కంటే నిర్మాతగానే ఆమెకు ఎక్కువ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న నిహారిక, ప్రస్తుతం తన రెండో భారీ ప్రాజెక్ట్ ‘రాకాస’ మూవీ పనుల్లో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూనే, మరోవైపు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు పలు మూవీ ఈవెంట్లలో పాల్గొంటూ చిన్న సినిమాలకు అండగా నిలుస్తోంది. తాజాగా.. ‘శ్రీచిదంబరంగారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిహారిక, ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సినిమా నిర్మాణం అనేది కేవలం పెట్టుబడికి సంబంధించిన విషయం కాదని, అది ఒక పెద్ద బాధ్యత అని ఆమె పేర్కొంది. ముఖ్యంగా ఒక చిత్రాన్ని పూర్తిస్థాయిలో భుజాన వేసుకున్నప్పుడు కలిగే మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో ‘కమిటీ కుర్రోళ్లు’ సమయంలో తనకు స్వయంగా అనుభవమైందని చెప్పింది. అలాగే తన తొలి సినిమా రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘మొదటి సినిమా అనుభవం లైఫ్‌లో మళ్లీ రాదు. రిలీజ్ ముందు ఉండే బెరుకు, నమ్మకం - ఈ రెండూ చాలా క్యూట్ ఫీలింగ్స్. అప్పటి ఎగ్జైట్‌మెంట్, అనుభవం జీవితాంతం గుర్తుంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి ప్రశంస మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని తెలిపింది. ప్రస్తుతం ఆమె నిర్మాణంలో వస్తున్న ‘రాకాస’ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ ఫాంటసీ కామెడీ డ్రామాను 2026 ఏప్రిల్ 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.






