- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మిరాయ్’ కి రెమ్యునరేషన్ తీసుకోని తేజ సజ్జా.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల ‘మిరాయ్’ (Mirai)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అయితే ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా.. శ్రియా శరణ్, మంచు మనోజ్, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘‘హనుమాన్ తర్వాత అంత పెద్ద హిట్ తర్వాత మూడేళ్ల పాటు ఒక హీరో ఒక సినిమానే నమ్ముకుని పని చేశాడు. తన రెమ్యునరేషన్ కూడా చిత్రానికే పెట్టండి సార్ అని. సినిమా అంతా అయిపోయిన తరువాతనే చూసుకుందాం" అని తేజా నిర్మాత విశ్వ ప్రసాద్‌కు చెప్పారని తెలిసింది. ఆ డెడికేషన్ వల్లనే అతన్ని సక్సెస్ వెతుక్కుంటూ వచ్చింది. తేజ సజ్జా డెడికేషన్‌కు, టైమ్‌కి ఈ మిరాయ్ ఉదాహరణ. ఒక భగవంతుడి నుంచి వచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి తేజ సజ్జా రెమ్యునరేషన్‌పై పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో.. బాబీ ప్రశంసలతో ముంచేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా గ్రేట్ అని అంటున్నారు.






