పని మనిషితో విషం పెట్టించి చంపాలని చూశారు: Tanushree Dutta

by Chukka Sudharani |   (  Updated:2022-09-23 09:10:13  IST  )

Tanushree Dutta claims someone tried to poison her, multiple attempts were made to kill her

పని మనిషితో విషం పెట్టించి చంపాలని చూశారు: Tanushree Dutta
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల వరుసగా ఇండస్ట్రీ లొసుగులపై పెదవి విప్పుతున్న ఆమె.. తాజాగా తనను విషంపెట్టి చంపేందుకు పలుమార్లు ప్రయత్నించారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. లైంగిక వేధింపుల గురించి మాట్లాడినందుకు కారు బ్రేకులు తీసేసి చంపాలనుకున్నారని.. కానీ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావం జరిగినా దేవుడి దయతో ప్రాణాలతో బయటపడినట్లు తెలిపింది.

ఇక కొన్ని నెలల క్రితం తన ఇంట్లో పనిమనిషి ఆనారోగ్యానికి గురవగా ఆమె స్థానంలో వచ్చిన మహిళ తనకిచ్చే నీటిలో ఏదో కలుపుతున్నట్లు గుర్తించానన్న నటి.. 'నాకు ఏదైనా జరిగితే బాలీవుడ్ మాఫియా స్నేహితుడైన నానా పటేకర్ మొదటి నిందితుడు. చాలా మర్డర్ కేసుల్లో వారి పేర్లు వినిపించాయి. అలాంటి వారి సినిమాలు బహిష్కరించండి. దుర్మార్గులను ప్రతీకారంతో వెంబడించి తరిమికొట్టండి. నా గురించి నకిలీ వార్తలు రాసి వేధించిన వారిని వదిలిపెట్టొద్దు. చట్టం, న్యాయం నన్ను రక్షించకపోవచ్చు. కానీ ఈ గొప్ప దేశ ప్రజలు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. జై హింద్.. బై! ఫిర్ మిలేంగే' అంటూ తాజా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.

Next Story