పెళ్లి చేసుకున్న తమన్నా.. భర్తను పరిచయం చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

తమన్నాకు ఏడాది క్రితమే వివాహం జరిగిందట. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచిన ఆమె, తన మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

పెళ్లి చేసుకున్న తమన్నా.. భర్తను పరిచయం చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమన్నా సింహాద్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్‌లో తనదైన స్టైల్‌లో సందడి చేసిన ఈమె, షో తర్వాత సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా, తమన్నా అందరికీ ఒక భారీ షాక్ ఇచ్చింది. తను ఒక ఇంటిదైనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమన్నాకు ఏడాది క్రితమే వివాహం జరిగిందట. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచిన ఆమె, తన మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. తన సొంత ఊరిలో భర్తతో కలిసి మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపింది. అయితే తన భర్త పేరు, ఇతర వివరాలను మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచింది.

చాలా కాలం తర్వాత తమన్నా ఇలాంటి ఒక తీపి కబురు చెప్పడంతో నెటిజన్లు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. తమన్నా జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి. అబ్బాయిగా పుట్టిన ఆమె అసలు పేరు మస్తాన్. అయితే తనలోని మార్పును గుర్తించి, ముంబైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఆ తర్వాత తన పేరును తమన్నా సింహాద్రిగా మార్చుకుంది. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న మొదటి ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్‌గా ఆమె అప్పట్లో రికార్డు సృష్టించింది. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తమన్నా, ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Next Story