- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Surya-45: ‘సూర్య-45’కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) రీసెంట్‌గా ‘రెట్రో’(Retro) మూవీతో మనముందుకు వచ్చి అశించినంతగా విజయం సాధించలేక పోయాడు.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) రీసెంట్‌గా ‘రెట్రో’(Retro) మూవీతో మనముందుకు వచ్చి అశించినంతగా విజయం సాధించలేక పోయాడు. ప్రస్తుతం ఆయన ‘సూర్య-45’(Surya-45) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఇక దీనికి ఆర్జే బాలాజీ(RJ Balaji) దర్శకత్వం వహిస్తుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ రాజ్(SR Prakash Raj), ఎస్. ఆర్ ప్రభు(SR Prabhu) గ్రాండ్‌గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇందులో సూర్య సరసన త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తుండా.. సాత్విక(Sathika), యోగి బాబు(Yogi Babu), నట్టి(Natti), అనఘా రవి(Anagha Ravi)(కోలీవుడ్ ఎంట్రీ) కీరోల్ ప్లే చేస్తున్నారు.
అయితే ఇది సూర్య- బాలాజీ కాంబోలో వస్తున్న మూడో చిత్రం. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. కాగా దీనికి ఏ ఆర్ రెహమాన్(AR Rahman) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘పెట్టైక్కరన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు రాగా.. ఇప్పుడు ఈ సినిమాకు ‘వెట్టై కరుప్పు’ అనే టైటిల్‌ను లాక్ చేసినట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా దీనిపై తర్వలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






