45 ఏళ్ల వయసులో సురేఖా వాణి రెండో పెళ్లి.. సుప్రిత సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-08 10:47:47  IST  )

టాలీవుడ్‌లో తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి(Surekha Vani).

45 ఏళ్ల వయసులో సురేఖా వాణి రెండో పెళ్లి.. సుప్రిత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి(Surekha Vani). ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతుంది. సినిమాల్లో పద్ధతిగా కనిపించే సురేఖ, వ్యక్తిగత జీవితంలో మాత్రం తన కూతురు సుప్రితతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ, గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఇప్పుడు తన కూతురు సుప్రిత(Supritha) హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి సరసన ‘నాయుడు గారి అమ్మాయితో చౌదరి గారి అబ్బాయి’ అనే సినిమాతో సుప్రిత త్వరలోనే వెండితెరపై మెరవనుంది.

ఈక్రమంలో.. తాజాగా.. ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రిత తన తల్లి సురేఖావాణి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన తల్లి రెండో పెళ్లిపై సుప్రిత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘‘మా అమ్మకు ఒక తోడు ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆమె ఒంటరి అయిపోతుంది. అందుకే అమ్మకు రెండో పెళ్లి చేసిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను’’ అని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తల్లి రెండో పెళ్లి విషయంలో ఇప్పటికే తన మేనమామలతో కూడా మాట్లాడానని, అమ్మకు మంచి తోడును వెతికే బాధ్యత తనదేనని ఆమె స్పష్టం చేసింది.

తల్లికి కాబోయే భర్త గురించి కొన్ని కండీషన్లు కూడా పెట్టింది సుప్రిత. ‘‘మా అమ్మను ప్రశ్నించకుండా, ఆమెను తనకి నచ్చినట్లు ఉండనిచ్చే వ్యక్తి కావాలి. ముఖ్యంగా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోవాలి’’ అని చెప్పింది. అయితే సురేఖావాణి మాత్రం తన దివంగత భర్త స్థానాన్ని ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడటం లేదని సుప్రిత వెల్లడించింది. ఇక తన పెళ్లి గురించి చెబుతూ.. తనకు కాబోయే భర్త తనను బాగా అర్థం చేసుకోవాలని, తాను వండిన నాన్-వెజ్ వంటకాలను సైలెంట్‌గా తినాలని సరదాగా చెప్పుకొచ్చింది. సుప్రిత చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మా డబ్బులతో ట్రిప్పులకు వెళ్తే మీకేంటి ప్రాబ్లం.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుప్రిత

Next Story