ఆమె లేకపోతే నేను లేను.. లతకు రుణపడి ఉంటానన్న Superstar Rajinikanth

by Harish |
ఆమె లేకపోతే నేను లేను.. లతకు రుణపడి ఉంటానన్న Superstar Rajinikanth
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ తన భార్య లతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంటున్నాడు. సాధారణంగా చాలా సమావేశాల్లో సతీమణి గురించి గొప్పగా చెప్పే తలైవా.. తాజాగా ఓ సమావేశంలోనూ తన భార్య కుటుంబానికి చేసిన మేలు మరిచిపోనంటూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు.


'నా భార్య లతను పరిచయం చేసిన వై.జీ మహేంద్రన్‌కు రుణపడి ఉంటా. కండక్టర్‌గా ఉన్నప్పుడు రోజూ తాగేవాడిని. ఎన్ని సిగరెట్స్ తాగుతున్నానో కూడా లెక్క ఉండేది కాదు. అలాగే రోజు నాన్ వెజ్ తినేవాడిని. కనీసం రోజుకు రెండుసార్లు నాన్ వెజ్ ఉండాల్సిందే. లేదంటే కష్టంగా ఫీల్ అయ్యేవాడిని. ఈ మూడింటిని ఎక్కువగా తీసుకుంటే 60 ఏళ్ల తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరు. నిజానికి నా భార్య లత నన్ను చాలా మార్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నా' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా రజనీ భాగస్వామిని నెటిజన్లు పొగిడేస్తున్నారు.



Next Story