- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సంఘటన నుంచి కోలుకోలేకపోతున్నా: Sunaina
తమిళ్ యంగ్ బ్యూటీ సునైనా బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నానంటోంది. ‘కుమార్ vs కుమారి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అందం, అభినయంతో భారీ.. Latest Telugu News

దిశ, సినిమా : తమిళ్ యంగ్ బ్యూటీ సునైనా బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నానంటోంది. 'కుమార్ vs కుమారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అందం, అభినయంతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఎల్లప్పుడూ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా టచ్లో ఉండే బ్యూటీని తాజా ఇంటరాక్షన్లో ప్రేమ, పెళ్లి గురించి అభిమానులు ఆసక్తికర ప్రశ్నలు అడగగా అన్నింటీకి సమాధానం చెప్పి అలరించింది.' మీరు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు? మీ దృష్టిలో విజయానికి నిర్వచనం ఏమిటి?' అనే సందేహాలకు సమాధానంగా.. 'బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు. మరికొంత కాలం ఒంటిరిగా ఉండాలనే అనుకుంటున్నా. మనం కోరుకున్నది మనసొంతం అయినపుడు ఎంతో సంతోషాన్నిస్తుంది. కష్ట సమయాల్లో ఉన్నపుడు బుక్స్ చదువుతుంటా. పుస్తక పఠనం వల్ల ఉపశమనం కలుగుతుంది. తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నా' అంటూ చెప్పుకొచ్చింది.






