- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఫౌజీ' లో సుధీర్ కొడుకు..ఏకంగా ప్రభాస్ పాత్రలోనే !
ప్రభాస్ నటించిన ఫౌజీ సినిమాలో మహేష్ బాబు మేనల్లుడు, హీరో సుధీర్ కుమారుడు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుధీర్

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హను రాఘవపూడి ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా పౌరాణిక చిత్రం కాదని.. భగవద్గీత నుంచి తాత్విక స్ఫూర్తిని మాత్రమే తీస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి రాజకీయ అలాగే సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారట.
అయితే అలాంటి ఈ సినిమా గురించి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. ప్రభాస్ నటించిన ఫౌజీ సినిమాలో మహేష్ బాబు మేనల్లుడు, హీరో సుధీర్ కుమారుడు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుధీర్ కొడుకు దర్శన్.. ప్రభాస్ చిన్ననాటి పాత్ర చేస్తాడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా మహేష్ బాబు నిర్మిస్తున్న గూడచారి 2 సినిమాలో దర్శన్ ఒకే కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్లిక్






