'హంట్' ప్రయాణం మామయ్య గారికి అంకితం: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్

by Dishanational4 |
హంట్ ప్రయాణం మామయ్య గారికి అంకితం: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సుధీర్ బాబు, భరత్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'హంట్'. మహేష్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన సినిమా జనవరి 26న థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన సుధీర్.. 'కృష్ణ గారి మరణం తర్వాత నా తొలి సినిమా. ఆయన లేకపోవడం నాకు వెలితి. ఇంతకు ముందు తెలుగులో ఎవరూ చేయని సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు షాకింగ్ ఎలిమెంట్ ఉంది. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుందని అనుకున్నా' అన్నాడు. అలాగే తమ చిత్రాన్ని ఆదరించి గొప్ప విజయం అందిస్తారని ఆశిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్, భరత్, గోపరాజు రమణ మాట్లాడుతూ.. ట్రైలర్ చూసి కథ ఊహించినప్పటికీ థియేటర్లలో వేరే కిక్ ఇస్తుందని, పోలీస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇందులో ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, నటి మౌనిక రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed