రంగులు ఎప్పుడూ సిగ్గుమాలినవి కావు.. కొందరి ఆలోచనలే సిగ్గులేనివి: సుచిత్ర

by Disha Web Desk 2 |
రంగులు ఎప్పుడూ సిగ్గుమాలినవి కావు.. కొందరి ఆలోచనలే సిగ్గులేనివి: సుచిత్ర
X

దిశ, ఫీచర్స్: ఇండియన్ పాపులర్ ప్లే బ్యాక్ సింగర్, రేడియో జాకీ సుచిత్ర కృష్ణమూర్తి 'పఠాన్' సినిమాకు మద్దతుగా నిలిచింది. ఇటీవల విడుదలైన 'బేషరమ్ రంగ్' సాంగ్ వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో షారుఖ్‌-దీపికలకు తన పూర్తి సపోర్టు ఉంటుందని బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తనదైన స్టయిల్‌లో రియాక్ట్ అయిన సుచిత్ర.. 'రంగులు ఎప్పుడూ సిగ్గులేనివి కావు.. కొందరి ఆలోచనలే సిగ్గులేనివి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు సినిమాను రాజకీయం చేయడం సమంజసం కాదన్న ఆమె, ఇంతకంటే దారుణమైన సీన్లు ఎన్నడూ చూడలేదా? అని ప్రశ్నించింది. కొందరు కేవలం రంగులనే ఉద్ధేశిస్తూ కామెంట్స్ చేయడం సిగ్గులేని చర్యగా పేర్కొన్నది. ఇకనైనా అలాంటివారు తమ ఆలోచన విధాన్ని మార్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా 'పఠాన్' 2023 జనవరి 25న విడుదల కానుంది.

READ MORE

అభిమానులతో 700 సెల్ఫీలు దిగిన KGF hero Yash (వీడియో)

Next Story

Most Viewed