- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది మీకు తెలిసింది కాదు.. కాలం తిగరాసిన కథ.. ‘కథనార్’ నుంచి స్టార్ హీరోయిన్ పోస్టర్ రిలీజ్
బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన అనుష్క శెట్టి (Anushka Shetty)ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరం అయింది.

దిశ, సినిమా: ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన అనుష్క శెట్టి (Anushka Shetty)ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ తర్వాత అడపా దడపా చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. ఇక ఇటీవల ‘ఘాటి’తో చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో అంతా ఆమె మొత్తానికే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుందని భావించారు. కానీ ఆమె నటించబోతున్న ఓ పాన్ ఇండియా మూవీ విడుదల కాలేదని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వీటీ ఫాంటసీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కథనార్’ టైటిల్‌తో వస్తుండగా.. ఇందులో జై సూర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన ఓ హీరో పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచగా.. హీరోయిన్ పోస్టర్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. నేడు అనుష్క శెట్టి పుట్టినరోజు కావడంతో మూవీ టీమ్ ఆమె విషెస్ తెలుపుతూ.. మేకర్స్ ‘కథనార్’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆమె నీల పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ.. ‘‘మీకు తెలిసిన కథ కాదు.. కాలం తిగరాసిన కథ. ఆ కాలాతీత అందాన్ని ఆస్వాదించండి. మన నీలాకు.. ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’(Kathanar-The Wild Sorcerer)టీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’’ అని రాసుకొచ్చారు. అలాగే అనుష్క శెట్టి ఓ గుహలో నెత్తిపై రెడ్ కలర్ క్లాత్ వేసుకుని కూర్చొని దూదిలాంటి ఓ పుష్పాన్ని చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి రామానంద్ కథ అందించగా.. రోజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇది మొదటిది. కాగా 9వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం కథాంశం. ఈ చిత్రంలో అనుష్క శెట్టితో పాటు జయసూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్‌పై గోకులం గోపాలన్ దీనిని నిర్మిస్తున్నారు. కస్టమ్-బిల్ట్ స్టూడియోలో వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 2023లోనే స్టార్ట్ అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రం ‘పార్ట్-1’ గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఎట్టకేలకు నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. అప్పుడే ప్రమోషన్స్ పెంచిన టీమ్ అప్డేట్స్ షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తున్నారు.






