తీవ్ర అస్వస్థతకు గురైన స్టార్ హీరో.. హాస్పిటల్‌లో చేరడంతో ఆందోళనలో ఫ్యాన్స్

by Hamsa |
తీవ్ర అస్వస్థతకు గురైన స్టార్ హీరో.. హాస్పిటల్‌లో చేరడంతో ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చేరినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. డిహైడ్రేషన్‌ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై నేడు ఆహ్మదాబాద్‌లోని కేడీ హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయం గురించి తెలిసిన ఫ్యాన్స్ అసలు ఆయన ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతున్నారు. అలాగే తొందరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుతున్నారు.

కాగా.. షారుఖ్ ఖాన్ గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతూ ఫుల్ బిజీ అయిపోయాడు. మ్యాచ్‌లకు హాజరు కావడంతో డీహ్రైడ్రేషన్‌కు గురైనట్లు టాక్. అయితే షారుఖ్ ఖాన్ ఇటీవల జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అందరి దృష్టి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడింది. ఈ క్రమంలో షారుఖ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీయల్ అయిపోయే వరకు ఎలాంటి మూవీ ప్రకటించకుండా మ్యాచ్‌‌కు హజరవుతానని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ప్రకటించాడు. దీంతో ఈ విషయం తెలిసిన క్రికెట్ లవర్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

Next Story