స్టార్ హీరో మూవీకి ‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ టైటిల్ ఫిక్స్.. అతన్ని బైకాట్ చేయాలంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

కాశ్మీర్‌లోని పహల్గామ్ కొండ ప్రాంతం సమీపంలోని సుందరమైన గడ్డి మైదానంలో ఉన్న పర్యాటక ప్రదేశంలో ఏప్రిల్ నెలలో ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే.

స్టార్ హీరో మూవీకి ‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ టైటిల్ ఫిక్స్.. అతన్ని బైకాట్ చేయాలంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కాశ్మీర్‌లోని పహల్గామ్ కొండ ప్రాంతం సమీపంలోని సుందరమైన గడ్డి మైదానంలో ఉన్న పర్యాటక ప్రదేశంలో ఏప్రిల్ నెలలో ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని 26 మందిని చంపడంతో భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కొందరిని మరీ దారుణంగా.. ప్యాంట్ విప్పించి మరీ కాల్చి చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను కన్నీరు పెట్టేలా చేసింది. రెండు వారాల తర్వాత, భారతదేశం సైనిక చర్యతో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఎదురుదాడి చేసింది. ఇది రెండు ప్రత్యర్థులైన భారతదేశం, పాకిస్తాన్ మధ్య హింసను పెంచింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ వివాదం కాస్త సర్ధుమనిగింది.

ఈక్రమంలో.. తాజాగా, ఈ సంఘటన ఆధారంగా ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మలయాళ డైరెక్టర్ మేజర్ రవి (Major Ravi)దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ‘పహల్గామ్: ఆపరేషన్ సిందూర్’ (Pahalgam: Operation Sindoor)టైటిల్‌తో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మూకాంబికా దేవి ఆలయంలో జరిగినట్లు తెలుపుతూ రవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను షేర్ చేశాడు. దీనిని ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మిస్తున్నారు.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా.. ఇందులో తీవ్రమైన యాక్షన్ సీన్స్‌తో పాటు భావోద్వేగానికి సంబధించినవి, దేశభక్తిని చూపించే సన్నివేశాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ (Mohanlal)హీరోగా చేస్తున్నట్లు టాక్. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రవిని బైకాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story