త్వరలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ రకుల్..కారణం అదేనా?

by Disha Web Desk 8 |
త్వరలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ రకుల్..కారణం అదేనా?
X

దిశ, సినిమా : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కొన్ని రోజుల పాటు తెలుగులో తన హవా కొనసాగించిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ కూడా తన అందంతో మాయచేసింది. అంతేకాకుండా అక్కడే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానిని ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని, ఇప్పుడు తన భర్తతో చాలా సంతోషంగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ నటి త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందంట. ఆమె ఇప్పటికే చాలా బిజినెస్‌లు రన్ చేస్తోంది. అంతే కాకుండా తాజాగా హైదరాబాద్‌లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. దీంతో ఈ బ్యూటీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి, బిజినెస్ వర్క్స్ చూసుకోనుంది అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed