పుచ్చకాయలకు రంగు ఎలా నింపుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! (వీడియో వైరల్)

by Disha Web Desk 5 |
పుచ్చకాయలకు రంగు ఎలా నింపుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవికాలంలో ఎండ తాపం నుంచి తట్టుకునేందుకు అధిక నీటి శాతం ఉన్న పండ్లు తినడమో, పండ్ల రసాలు సేవించడమో చేస్తుంటాము. కానీ ఈ వీడియో చూస్తే పండ్లను తినాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి పండ్లనా మనం తింటున్నది అని ఎవ్వరికైనా అనిపిస్తోంది. పుచ్చకాయల్లో రంగు నింపుతూ పోలీసులకు పట్టుబడ్డ ఓ పండ్ల వ్యాపారి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇతన్ని పట్టుకున్న పోలీస్ అధికారి అందరికీ అవగాహన కలిగేలా పండ్ల వ్యాపారి చేసే దారుణాన్ని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో ఆ పండ్ల వ్యాపారి పుచ్చకాయలకు ఎరుపు రంగు, వాటిలో తీపిని పెంచేందుకు మరో ద్రవం నింపుతున్నాడు. ముందుగా కొన్ని రసాయనాలు ఉపయోగించి ఎరుపు రంగును, తీపి ద్రవాన్ని తయారుచేస్తున్నాడు. రంగు తయారైన విధానం చూసి పోలీస్ అధికారి సైతం ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం ఇంజక్షన్ ద్వారా వాటిని పుచ్చకాయల్లోకి నింపి విక్రయిస్తున్నాడు. ఇది తెలియని అమాయక జనం వాటిని తీసుకెళ్లి పిల్లలకు తినిపించి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని ఆ అధికారి ఆవేధన వ్యక్తం చేశారు. అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆ పండ్ల వ్యాపారి వేలల్లో లంచం ఇవ్వచూపిన లొంగక అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించాడు. అయితే ఈ వీడియో చూసిన కొందరు ఇది ప్రజల అవగాహన కోసం తీసిన వీడియో అని, అది అంతా అబద్దం అని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Next Story

Most Viewed