- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఒక సిగ్గులేని ఆడదాన్ని.. అలాంటి పనులు చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ నటి
బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్(Vidya Balan) అందరికీ సుపరిచితమే. పరిణీత చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్(Vidya Balan) అందరికీ సుపరిచితమే. పరిణీత చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ‘డర్టీ పిక్చర్స్’(Dirty Pictures) మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. వరుస సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రకటించనప్పటికీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, విద్యాబాలన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఒక సిగ్గులేని ఆడదాన్ని. నాకు ఆత్మ విశ్వాసం ఎక్కువ. అందుకే బరువు పెరిగానని ఏడుస్తూ కూర్చోలేను.
అలా బరువు ఉన్నప్పుడే నేను లీడ్ రోల్స్ చేశాను. నేను బరువు ఉన్నాను.. ఆ పాత్ర నాకు సెట్ అవ్వదేమో అనే అభద్రతా భావం నాలో ఎప్పడూ కలగలేదు. చుట్టూ ఉన్న జనాలు ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ నేను మాత్రం బరువు తగ్గలేదు. అస్సలు బాధపడలేదు. కానీ బరువు తగ్గడానికి చాలనే చేశాను. వ్యాయామాలు, డైట్, నాన్ వెజ్ మొత్తం మానేశా. ఏడాది పొడవునా కూరగాయలు తిన్నాను. చాలా వరకు బరువు తగ్గాను. కానీ కొన్ని నెలల తర్వాత మళ్లీ యధాస్థితికి చేరుకున్నాను. అయినా నేను అవన్నీ చేస్తూనే వస్తున్నాను. ఈక్రమంలోనే నేను ఒక విషయాన్ని గ్రహించాను. మనిషి బాడీకి అన్ని కూరగాయలు పడవు. కాబట్టి బాడీకి సరిపడే వాటినే తినాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.






