- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోలీవుడ్ చాన్స్ కొట్టేసిన శ్రీలీల..రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందిగా..
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉందో చెప్పకర్లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉందో చెప్పకర్లేదు. కెరీర్ మొదట్లో కన్నడ సినిమాలలో నటించి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బ్యూటీ.. ‘పెళ్లి సందడి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ‘ధమాకా’తో మంచి సక్సెస్ అందుకుని సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
ఇప్పుడు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కోసం శ్రీలీల ఇంకో కోటి పెంచేసినట్లు టాక్. రూ. 5 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పడంతో.. అందుకు కూడా ఒప్పుకున్నారట మేకర్స్. ఇక ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నట్టుగా సమాచారం.






