శ్రీవిష్ణు బర్త్ డే స్పెషల్.. ‘సామజవరగమన’ గ్లింప్స్ రిలీజ్

by Disha Web Desk 13 |
శ్రీవిష్ణు బర్త్ డే స్పెషల్.. ‘సామజవరగమన’ గ్లింప్స్ రిలీజ్
X

దిశ, సినిమా: మొదటి నుంచి విభిన్నమైన జోనర్‌లతో అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు.. చాలా గ్యాప్ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ అనే బిగ్గెస్ట్ స్ట్రెంత్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనిల్ సుంకర సమర్పిస్తున్న చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా రెబా మోనికా కథానాయికగా నటిస్తోంది. అయితే శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.

ఆహ్లాదకరమైన సంగీతంతో ప్రారంభమైన వీడియోలో తన గర్ల్ ఫ్రండ్‌నే వివాహం చేసుకోవాలని సిద్ధపడిన హీరోకు పెద్ద సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ఇది యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుండగా.. ఈ వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ కీలకపాత్రలు పోషిస్తు్న్న మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.



Next Story

Most Viewed