అది చాలా కష్టం..! టాలీవుడ్ స్టార్ హీరోలపై శ్రీలీల వైరల్ కామెంట్స్

by Disha Web Desk 7 |
అది చాలా కష్టం..! టాలీవుడ్ స్టార్ హీరోలపై శ్రీలీల వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో శ్రీలీల ఒకరు. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. బాలకృష్ణ, మహేశ్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక శ్రీలీల యాక్టింగ్, అందం గురించి పక్కన పెడితే.. డ్యాన్స్ కూడా సూపర్‌గా చేస్తుంది. తన డ్యాన్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన డ్యాన్స్ గురించి అడగ్గా.. టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ శ్రీలీల మాట్లాడుతూ.. ‘నా డ్యాన్స్ కంటే టాలీవుడ్ హీరోలు చేస్తున్న యాక్షన్ సీన్స్ చాలా కష్టం. మన హీరోలు మూవీస్ కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎంతో కష్టపడతారు. ఇక టాలీవుడ్‌లో వస్తున్న సినిమాలు వేరే ఇండస్ట్రీ ఫిల్మ్ సర్కిల్‌లో కూడా చర్చగా మారుతున్నాయి అంటే దానికి కారణం మన వాళ్ల కష్టమే. అంటే మనవాళ్ల డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్‌లు, సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ ఆ రేంజ్‌లో ఉంటాయన్న మాట’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. కాగా శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో బిజీగా ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed