- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas: ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ‘స్పిరిట్’ మూవీ టీమ్.. ఈ లక్కీ చాన్స్ కోసం ఏం చేయాలంటే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit). ఇప్పటికూ అధికారిక ప్రకటన విడుదలై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎదురుచూస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ కాకముందే మూవీ మేకర్స్ ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రభాస్‌తో నటించే ఛాన్స్ సంపాదించుకోవచ్చని వెల్లడించారు. ఆడిషన్స్ నిర్వహించబోతున్న మూవీ టీమ్ 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.
ఇక ఇందులో పాల్గొనాలంటే [email protected]కి వివరాలు పంపించాలని తెలిపారు. పూర్తి పేరు, వయసు, ఎత్తు, ఫోన్ నెంబర్, లోకేషన్, ఫొటోతో పాటు 2 నిమిషాల వీడియో చేసి పంపించాలని తెలిపారు. అలాగే ఇందులోని రోల్ కోసం షార్ట్ హెయిర్ కట్ ఉండాలని కూడా ప్రకటనలోనే వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ లక్కీ చాన్స్‌ను కొట్టేసేందుకు పలువురు తమ వివరాలను పంపుతున్నారు. కాగా. ‘స్పిరిట్’ సినిమాతో డార్లింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుకుంటున్న ‘స్పిరిట్’ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.






