ప్రియాంక మోహన్ కు ‘ఓజీ’ , ‘సరిపోదా శనివారం’ టీంల నుంచి స్పెషల్ బర్త్ డే విషెస్..!

by Disha Web Desk 7 |
ప్రియాంక మోహన్ కు ‘ఓజీ’ , ‘సరిపోదా శనివారం’ టీంల నుంచి స్పెషల్ బర్త్ డే విషెస్..!
X

దిశ, సినిమా: తన అందం, అభినయం, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి ప్రియాంక అరుల్ మోహన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘OG’ ఒకటి. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి లాంటి ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇక నేడు హీరోయిన్ ప్రియాంక మోహన్ పుట్టిన రోజు సందర్భంగా ‘OG’ టీం స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. హ్యాపీ బర్త్ డే ప్రియాంక మోహన్ అంటూ విడుదల చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ‘ఓజి’ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ లో ప్రియాంక మోహన్.. నాని సరసన ‘సరిపోదా శనివారం’ చిత్రంలో కూడా నటిస్తుంది. దీనితో రెండు చిత్రాల నుంచి ప్రియాంకకి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.



Next Story

Most Viewed