సౌత్ వాళ్ళు స్వార్థపరులు.. సినిమా పోస్టర్‌లో హీరోయిన్ ఫొటో కూడా పెట్టరంటూ జ్యోతిక సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక(Jyothika), అజయ్ దేవ్ గన్, ఆర్ మాధన్ కాంబోలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘షైతాన్’.

సౌత్ వాళ్ళు స్వార్థపరులు.. సినిమా పోస్టర్‌లో హీరోయిన్ ఫొటో కూడా పెట్టరంటూ జ్యోతిక సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక(Jyothika), అజయ్ దేవ్ గణ్, ఆర్ మాధన్ కాంబోలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘షైతాన్’. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పనుల్లో చిత్రబృందం ఫుల్ బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అజయ్ దేవ్ గన్, మాధవన్, జ్యోతిక ఓ మూవీ ఈవెంట్‌కు గెస్టులుగా వెళ్లారు. ఇందులో భాగంగా జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn) షూటింగ్‌ కండక్ట్ చేసే విధానం చూస్తే సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆయనతో చేసిన ‘షైతాన్’ మూవీ సినిమా పోస్టర్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నేను చాలామంది సౌత్ హీరోలతో కలిసి నటించాను. కానీ అలా ఎవరూ చేయలేదు. రీసెంట్‌గా నా చివరి మూవీ మమ్ముట్టితో చేసిన ‘కాథల్-ది కోర్’ చిత్రం పోస్టర్‌ను కూడా మమ్ముట్టి తన సోషల్ మీడియాలో పెట్టారు. అది చూడటానికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ దక్షణాదిలో ఎంతోమందిలో చేసినప్పటికీ వారు అలా చేయలేదు. చాలా స్వార్థపరులు.. పోస్టర్‌లో హీరోయిన్‌ ఉండటాన్ని ఇష్టపడరు. అజయ్ దేవ్‌గణ్, మమ్ముట్టి (Mammootty)రియల్ స్టార్స్. ఇండస్ట్రీలో అందరూ ఏదో ఒకటి తీసుకునే వాళ్లే ఉంటారు కానీ ఇచ్చేవాళ్లు ఉండరు. అలాంటి వాళ్లు రేర్‌గా ఉన్నారు. అజయ్ దేవ్‌గన్ వాళ్లు సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడం గ్రేట్. చాలా ఏళ్లుగా ఓ విషయాన్ని గమనించాను.. ఎలా వదిలించుకోవాలని చూస్తారు కానీ గుర్తింపు ఇవ్వాలనుకోరు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

link

Next Story