దీపికా పదుకొణె-సందీప్ రెడ్డి వంగా వివాదంపై సోనాక్షి సిన్హా షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), ప్రభాస్(Prabhas) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’(Spirit).

దీపికా పదుకొణె-సందీప్ రెడ్డి వంగా వివాదంపై సోనాక్షి సిన్హా షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), ప్రభాస్(Prabhas) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’(Spirit). భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో ప్రభాస్ మొట్టమొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా దీపికా(Deepika Padukone)ను సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వీరిద్దరి మధ్య వివాదం ఏర్పటినట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పని గంటలు, అత్యధిక రెమ్యునరేషన్ ఇవ్వాలని దీపికా డిమాండ్ చేయడంతో కోసం వచ్చిన సందీప్ రెడ్డి వంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ఈ కథను ఆమెకు సంబంధించిన పీఆర్ టీమ్ లీక్ చేయాలని చూసినట్లు సందీప్ పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను దానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాను. నా సపోర్ట్ దీపికా పదుకొణెకు ఇస్తాను. నేను ఎనిమిది గంటలకు మించి పని చేయని హీరోలతో పనిచేశాను. అప్పుడే నాకు అనిపించింది. ఇండస్ట్రీలో స్త్రీలకు, పురుషులకు సమానంగా ఎందుకు ఉండదో అని. మహిళా నటులకు ఎందుకు భిన్నంగా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. నేను 15 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. నాకంటే తక్కువ, నాకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఇతర నటులు ఉన్నారు. నువ్వు ఇచ్చిన టైమ్‌కు మించి షూటింగ్‌ చేయకూడదు. మీ కోసం కూడా మీరు సమయాన్ని ఉపయోగించుకోవాలి’’ అని చెప్పుకొచ్చింది.

Instagram link

Next Story