- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనాక్షి సిన్హా న్యాయ పోరాటం.. డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న లీగల్ థ్రిల్లర్!
ఇందులో ఒకరు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కనిపిస్తే, మరొకరు కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా తనదైన శైలిలో పోరాడుతారు.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘సిస్టమ్’. ఇద్దరు పవర్‌ఫుల్ లేడీస్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ చిత్రం ఒక హై వోల్టేజ్ లీగల్ థ్రిల్లర్‌గా రూపొందింది. విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక ఆసక్తికరమైన న్యాయపోరాటం చుట్టూ తిరుగుతుంది. వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు మొండి పట్టుదల గల మహిళల మధ్య జరిగే ఘర్షణే ఈ చిత్ర ప్రధాన స్టోరీ. ఇందులో ఒకరు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కనిపిస్తే, మరొకరు కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా తనదైన శైలిలో పోరాడుతారు.
అధికారం ఉన్నవారికే చట్టం చుట్టూ తిరిగే నేటి వ్యవస్థలోని లోపాలను, నిజం కంటే పదవికే ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితులను ఈ ఇద్దరు మహిళలు ఎలా ఎదుర్కొన్నారనేది దర్శకురాలు చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నారట.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. మే 22 నుంచి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240కి పైగా దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఒక కీలక పాత్రలో నటించారు. సోనాక్షి, జ్యోతికల మధ్య జరిగే యుద్ధం, వ్యవస్థలోని కుళ్లును కడిగిపారేసే వారి ప్రయత్నం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.






