- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి వారికి సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి: విద్యాబాలన్
బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్(Vidya Balan) వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్(Vidya Balan) వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక గత ఏడాది ఆమె ‘దో ఔర్ దో ప్యార్’(Do Aur Do Pyaar) చిత్రంతో వచ్చింది కానీ హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం విద్యాబాలన్ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేనప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది.
ఎందుకంటే.. వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి. తల్లులకు తక్కువ పని గంటలు పెట్టాలి. అలాంటి వారితో పోలిస్తే నాకు బాధ్యతలు తక్కువ కాబట్టి ఎక్కువ సమయం పెట్టాలి. నేను 12గంటలైనా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడ చిత్రీకరణ చేసిన నాకు వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని చెప్పుకొచ్చింది.






