- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమెడియన్ మనోబాల మృతికి ఆ చెడ్డ అలవాటే కారణమా..?
by Chukka Sudharani |
కమెడియన్ మనోబాల నిన్న మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ మనోబాల నిన్న మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. తన కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మనోబాల మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. అయితే మనోబాల మృతికి కారణం సిగరెట్ అలవాటేనని తెలుస్తోంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనకున్న వ్యసనం గురించి తెలిపారు. అంతేకాదు.. ధూమపానానికి బానిసైన ఆయన నిత్యం సుమారు 100 సిగరెట్లు కాల్చేవారని, దీంతో లివర్ దెబ్బతినిందని సన్నిహితులు చెబుతున్నారు. ఇదే కారణంగా కొన్ని నెలల క్రితం మనోబాలను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 1953 డిసెంబర్ 8న జన్మించిన మనోబాల ఇప్పటి వరకు 450కి పైగా సినిమాల్లో నటించారు. కాగా.. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.
Next Story






