- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళపతి కోసం రంగంలోకి దిగిన శింబు.. ‘జననాయగన్’ వివాదంపై షాకింగ్ రియాక్షన్!
దళపతి విజయ్(Thalapathy Vijay) చివరి చిత్రం ‘జననాయగన్’(Jananaayagan) విడుదల విషయంలో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

దిశ, సినిమా: దళపతి విజయ్(Thalapathy Vijay) చివరి చిత్రం ‘జననాయగన్’(Jananaayagan) విడుదల విషయంలో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు, కోర్టు కేసుల కారణంగా జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఇక విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో కావాలనే ఈ సినిమాను అడ్డుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, కోలీవుడ్ స్టార్ హీరో, విజయ్ స్నేహితుడు శింబు ఈ విషయంపై స్పందించాడు. శింబు (Simbu)మాట్లాడుతూ.. ‘‘విజయ్ అన్న నుండి ‘జననాయగన్’ అనే బిరుదును ఎవరూ వేరు చేయలేరు. ఆయన ఎన్నో తుపాన్లను దాటుకుని ఈ స్థాయికి వచ్చారు. ఇది కూడా గడిచిపోతుంది. ఆయన కెరీర్ లోనే ఇది చివరి సినిమా.
ఈ మూవీ కోసం ఇండస్ట్రీ మొత్తం ఆయనకు అండగా నిలబడాలి. అందుకే నేను ట్వీట్ చేశాను. నిజమైన పండుగ అంటే ఈ చిత్రం విడుదలైన రోజే మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణంపై స్పందిస్తూ.. ‘‘రాజకీయాల గురించి మాట్లాడేంత అనుభవం నాకు లేదు. కానీ ఆయన రాజకీయ భవిష్యత్తుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని శింబు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి సానుకూల నిర్ణయం వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ‘జననాయగన్’ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో పూజా హెగ్డే, ప్రియమణి, మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ టాప్ బ్యానర్ కెవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రాబోతున్నట్లు టాక్.






