యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్న సిద్ధూ జొన్నలగడ్డ.. డైరెక్టర్ ఎవరంటే?

by Mallepaka Hamsa |

వరుస విజయాలతో దూసుకుపోతున్న సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda).. తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్న సిద్ధూ జొన్నలగడ్డ.. డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda).. తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక ప్రత్యేకమైన యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ కోసం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే(Swaroop RSJ)తో సిద్ధు జొన్నలగడ్డ జతకట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవించి రూపొందించనున్నట్లు సమాచారం. సిద్ధూ ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో కనిపించనున్నాడని టాక్. ఈ క్రేజీ కాంబినేషన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్ధ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉండగా, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు టైటిల్, హీరోయిన్ వివరాలు వెల్లడించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సిద్దు జొన్నలగడ్డ– స్వరూప్ మూవీ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో, ఫుల్ ఎంటర్‌టైనర్‌‌గా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story