ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ ‘టక్కర్’ టీజర్

by Disha Web Desk 7 |
ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ ‘టక్కర్’ టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్: చార్మింగ్ హీరో సిద్ధార్థ్, డైరెక్టర్ కార్తీక్ జి. క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టక్కర్’. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈరోజు (ఏప్రిల్ 17) సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ‘టక్కర్’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన టక్కర్ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

‘‘నేనంటే ఇష్టం లేదా’’, ‘‘లవ్ అంటేనే ఇష్టం లేదా’’ అంటూ హీరోహీరోయిన్ల మధ్య జరిగే సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన టీజర్ ఎంతో ఇన్‌ట్రెస్టింగ్‌గా సాగింది. కాగా.. ఈ సినిమా మే 26 న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story