బికినీలో తడి అందాలతో రెచ్చిపోయిన శ్రియ శరన్.. బోల్డ్ ఫొటోలు వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-14 11:29:13  IST  )

సముద్రపు ఒడ్డున బికినీ ధరించి శ్రియ చేసిన గ్లామర్ షో..

బికినీలో తడి అందాలతో రెచ్చిపోయిన శ్రియ శరన్.. బోల్డ్ ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: సాధారణంగా హీరోయిన్లు కొందరు పెళ్లి అయిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. మరికొందరైతే పెళ్లి అయి, పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబానికే పరిమితం అవుతారు. కానీ, శ్రియ శరణ్ (Shriya Saran)విషయంలో ఇది పూర్తిగా ఉల్టా అని చెప్పాలి. పెళ్లై, ఒక పాపకు జన్మనిచ్చినప్పటికీ, శ్రియ తన గ్లామర్‌ను ఇసుమంతైనా తగ్గనీయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 40 ఏళ్లు దాటినా, ఇప్పటి యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. గత ఏడాది శ్రియ నటించిన ‘రెట్రో’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా, ఆమె మాత్రం నిరాశ చెందకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది.

బికినీలో గ్లామర్ షో

ఒక పక్క కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే, మరోపక్క తన వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఎంత బిజీగా ఉన్నా తన భర్త ఆండ్రీ కోస్చీవ్, కూతురు రాధాతో కలిసి వెకేషన్లకు వెళ్లడం శ్రియకు అలవాటు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా.. శ్రియ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సముద్రపు ఒడ్డున బికినీ ధరించి శ్రియ చేసిన గ్లామర్ షో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. బీచ్‌ ఇసుకలో పడుకుని ఆమె ఇచ్చిన బోల్డ్ పోజులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 44 ఏళ్ల వయసులో కూడా ఇంత పర్ఫెక్ట్ బాడీ షేప్ ఎలా మెయింటైన్ చేస్తోందని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వయసు పెరుగుతున్నా నీ అందం మాత్రం తగ్గడం లేదు.. అమ్మవైనా సరే.. నీ అందం మత్తెక్కించేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Next Story